ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నేడు మంగళగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో లోకేష్ బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొనడానికి నారా లోకేష్ వెళ్లారు.