ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. టీడీపీ కూటమి నుంచి 164 మంది గెలిచారు. వైసీపీ నుంచి 11 మంది మాత్రమే విజయం సాధించారు. గత శాసనసభలో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 11కు తగ్గిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించలేదు. దీంతో శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహరశైలి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది చర్చ జరుగుతోంది. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో పాల్గొని అందరితో పాటు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా.. లేదా శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటారా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
![]() |
![]() |