సింహాచలం అప్పన్నను రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనిత దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఘనంగా ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం వంటివి ఇచ్చారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్నారు. వైపీనీ హయాంలో కొంతమంది పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహారించారన్నారు. ఇప్పటికి వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగానే వ్యవహారిస్తున్నారన్నారు. మీకు ఇంకా జగన్ పై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని అనిత సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని.. అవసరమైతే వారి తరపున పోరాడుతానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కూడా త్వరలో జరుగుతుందని అనిత తెలిపారు.