అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎస్సార్ కళాశాలకు అనుమతి లేదని కళాశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకున్న ప్రైవేటు కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నయన్నారు. అందులో భాగంగా ఎస్సార్ గర్ల్స్ కళాశాలకు అనుమతులు లేకపోయినప్పటికీ కళాశాలను ప్రారంభించారని ఆరోపించారు.