తెనాలి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటలకు పైగా కురిసిన వర్షంతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. గాలుల కారణంగా చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడటంతో తీగలు తెగిపోయాయి. పలుచోట్ల గాలులకు స్తంభాలు విరిగిపడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సంగంజాగర్లమూడి వద్ద పిడుగుపడి చెట్టు నిలువునా చీలిపోయింది. వీఎ్‌సఆర్ అండ్ ఎన్‌వీఆర్ కళాశాల వద్ద ఫ్లెక్సీ హోర్డింగ్ కోసం ఏర్పాటుచేసిన సరివిబాదులు విద్యుత్ లైన్‌పై పడి తీగలు తెగిపోయాయి. పట్టణంలో కూడా చెట్లు పడిపోయి, కొమ్ములు పడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. సమస్యలేని ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా మరికొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ నిలిచిపోయింది. బోసురోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో రోడ్లు జలమయయ్యాయి. మురుగు కాల్వల్లో మురుగు వ్యర్ధాలు, రోడ్లపై పారే మోకాళ్ళ లోతు నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. పట్టణంలో ఓ ఇంటిపై విద్యుత్ స్తంభం కూలిపడింది. బోసురోడ్డులోని ఓ వ్యాపార సంస్థ సెల్లార్‌లో వర్షపునీరు భారీగా చేరడంతో అగ్నిమాపక సిబ్బందికి వచ్చి నీరు బయటకు తోడారు.
![]() |
![]() |