విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ప్రజావేదికను కూల్చివేయడాన్ని గుర్తు చేశారు. అలాంటి పనులు ఎప్పటికీ తమ అధినేత చేయరన్నారు. ప్రభుత్వ డబ్బు వృథా కానివ్వమని, నష్టం కలిగించేలా వ్యవహరించమని వెల్లడించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో నిలబడలేకపోతున్నారని, వారు ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని మాత్రం చెప్పనన్నారు.
![]() |
![]() |