రుషికొండపై మాజీ మంత్రి రోజా ట్వీట్‌కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషికొండ విషయమై రోజా మాట మార్చడాన్ని ప్రశ్నించారు. రోజాని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలతో పాటు నాడు చెప్పిన త్రి మ్యాన్ కమిటీ కథ కూడా బయటకు వస్తుందని వెల్లడించారు. ఓటమి కారణంగా రోజాకు మతి చెడిందని ఎద్దేవా చేశారు. రుషికొండ భవనాలు కాసేపు రాష్ట్రపతి కోసం అని.. కాసేపు ప్రభుత్వానివని చెబుతున్నారన్నారు. అసలు రుషికొండ ను బోడి గుండు చేయమని మీకు ఎవరు చెప్పారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ‘ఏంటమ్మా రోజా.. నాడు సీఎం నివాసం ఉండడానికని, అక్కడి నుంచే పరిపాలన సాగించడం కోసం అని చెప్పి, నేడు పర్యాటకుల కోసం నిర్మించాం అని చెప్తున్నారు. ఈ రోజాని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు ఏంటో.. నాడు చెప్పిన త్రి మాన్ కమిటీ కథ ఏంటో మొత్తం బయిటికి వస్తుంది. వర్షానికి కారిపోయే భవనాల్లోనే ఐదేళ్లు పాలన ఎలా చేశారు? రుషికొండలో అత్యంత నాణ్యతతో నిర్మించిన భవనాలు ఎవరి కోసం..? ఓటమి కారణంగా రోజాకి మతి చెడినట్లు ఉంది. రుషి కొండ భవనాలు కాసేపు రాష్ట్రపతి కోసం అని కాసేపు ప్రభుత్వానివి అని చెబుతున్నారు.. అసలు రుషికొండ ను బోడి గుండు చేయమని మీకు ఎవరు చెప్పారు ? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. దొరికితే దొంగ లేకుంటే దొరలా ఉన్నాయి మీ కబుర్లు. ప్రజల సొమ్ముతో సోకులు చేసుకునేందుకు సిద్ధమైన మీకు ఆ ప్రజలే బుద్ధి చెప్పారు’’ అని బుద్దా వెంకన్న అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa