ఆగి ఉన్న వ్యాన్‌ను బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి లోడ్‌తో ఓ మినీవ్యాన్ శ్రీకాకుళం వైపు వస్తుంది. మంగళవారం సాయంత్రం వాహనం టైర్ పంక్చర్ కావడంతో పాతకొప్పెర్ల వద్ద జాతీయరహదారి పక్కన ఆపి వాహనం డ్రైవర్ సాడి రమణ(50), తోనంగి నరశింహ(46) వాహనంలో కూర్చున్నారు. అదే సమ యంలో అదే దిశగా వస్తున్న ఓ యాత్రికుల బస్సు అతివేగంతో వచ్చి బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో మినీవ్యాన్‌లో ఉన్న నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రమణను చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులిద్దరూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం, వల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామానికి చెందివారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే స్థానిక ఎస్‌ఐ సన్యాశినాయుడితో పాటు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహించారు.
![]() |
![]() |