కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలో రాహుల్ కేక్ కోసి తినిపించారు. ఇందులో పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారంతా అగ్రనేతకు శుభాకాంక్షలు తెలిపారు.
![]() |
![]() |