శాసనసభ్యుల కోటాలో విధానపరిషత్ సభ్యుడిగా ఎన్నికైన జగదీశ్ శెట్టర్ రాజీనామాతో ఖాళీ అయిన ఒక స్థానానికి జూలై 12న ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. ఈనెల 25న నోటిఫికేషన్ జారీ కానుండగా అదే రోజు నుంచే నామినేషన్ల స్వీకరిస్తారు. జూలై 2వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా 3న పరిశీలనలకు, 5వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ కొనసాగనుంది. అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. జగదీశ్ శెట్టర్‌కు 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.