పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించేందుకు నిర్వహిస్తున్న నేను బడికి పోతా కార్యక్రమంలో లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 13 నుండి జూలై 12వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు.