ఏపీ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఆనం నారాయణరెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నెల్లూరులోని వారి స్వగృహంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల బొకే అందజేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు రాజకీయాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు.