ఈపూరుపాలెంలో ఇసుక లోడు లో వచ్చిన తల లేని మృతదేహం మిస్టరీ అలాగే మిగిలి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇసుక లోడ్ తెప్పించుకోగా దాన్ని వాహనం నుండి అన్లోడ్ చేసే సమయంలో ఈ మృతదేహం బయట పడింది. ఇది జరిగి మూడు నెలలు దాటినా ఇప్పటికీ పోలీసులు ఆ మృతదేహం ఎవరిదో కనిపెట్టలేదు. ఇది ఇసుక మాఫియా పనని అప్పట్లో ఇప్పటి మంత్రి నారా లోకేష్ ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడైనా మిస్టరీ వీడుతుందేమో చూడాలి.