వాల్మీకిపురం నియోజకవర్గంలో అవినీతి రహిత అభివృద్ధి సాధించడమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ధ్యేయమని వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక మార్కెట్ కమిటీ సమావేశ భవనంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాజకీయపార్టీల కక్షలు నియోజకవర్గ ప్రజలపై ప్రభావం చూపకుండా, గతంలో నిలిచిపోయిన అభి వృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. పలువురు మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. పీలేరు టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, నాయకులు గాంధీపేట రమణ, పీవీ నారాయణ, రాజేంద్రాచారి, ద్వారకనాథరెడ్డి, శేషాద్రి రెడ్డి, సుధా కర్‌రెడ్డి, కోసూరి రమేష్, చంద్రమౌళి, కేవీరెడ్డి, బొక్క సం బ్రదర్స్, తోటవీధి ఫణి, సైదు, సా దిక్, మహ్మద్ హుస్సేన, జావీద్, మస్కట్ మస్తాన, మున్వర్, జయకృష్ణ, ఎండీ యూసుఫ్, దామోదర్‌రెడ్డి, రామాం జులురెడ్డి, మదనమోఽహనరెడ్డి, మస్తానవల్లి తదిత రులు పాల్గొన్నారు. నాగరాజు పాదయాత్ర వాల్మీకి పురం పట్టణానికి చేరుకోగా పీలేరు టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా ఘనస్వాగతం లభించింది.