కృష్ణా జిల్లాలో 2024-25, 26 విద్యా సంవత్సరానికి ఐటీఐ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 21, 22, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కేబీఆర్ పాలిటెక్నిక్ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్, గుడివాడ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.గౌరీమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ నెం బర్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె సూచించారు. మెరిట్ నెంబరు కోసం కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ హెల్ప్ డెస్క్‌లో సంప్రదించాలన్నారు. వివరాలకు 08674-295953, 99851 62555, 82975 74757, 85559 52320 ఫోన్ నంబర్లలో సంప్ర దించి ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో అడ్మిషన్ పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులు రూ.60 డిపాజిట్ చెల్లించాలన్నారు. ప్రైవేటు ఐటీఐల్లో చేరేవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాలన్నారు.