ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే పైపు లైను లేకపోయినా నిర్వహణ బిల్లులు మంజూ రుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. పైపులైన్ ద్వారా ఏ గ్రామానికైనా తాగునీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు. నీటి పథకం నిర్మాణం పూర్తయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.