ఒంగోలు రూరల్ మండలంలోని గ్రామాల్లో మోటార్లు పాడై 15రోజుల నుంచి నీరు రాకపోవడంతో ప్రజానీకం అల్లాడిపోతున్నారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమా వేశం దృష్టికి తెచ్చారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీరు సరఫరా చేయాల్సిన బాధ్యత లేదా? అని అధికారులను ప్రశ్నించారు. మరో వైపు ఒంగోలులో గుడిసెవాసులు నివాసముం టున్న రైల్వే స్థలాల సమస్యను పరిష్కరించాల న్నారు. కార్మికశాఖలో పనిచేసే ఒక ఉద్యోగిపై చనిపోయిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఏవిధంగా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో సస్పెండ్ చేసే అధికారం ఉందా? అని నిలదీశారు. ఆ ఉద్యోగిని అద్దంకిలో నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ అధికారికి సూచించారు.