కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడుకు కేంద్ర కరువు బృందం గురువారం వస్తున్నట్లు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టరు రాహుల్ కుమా ర్రెడ్డి తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టరు రాహుల్కుమార్రెడ్డి బీమునిపాడు గ్రామం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 సంవ త్సరంలో వర్షాభావంతో రైతులు సాగు చేసిన పంటలు పండక కరువు పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం కరువు మండలంగా కోవెలకుంట్లతో పాటు ఇంకా కొన్ని మండలాలు ప్రకటించడంతో ఆయా మండలాల్లో అధికారులు రైతుల జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించి కరువు సాయాన్ని అందించాలని కోరడంతో కేంద్ర బృందం గురువారం భీమునిపాడుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు జయ ప్రకాశ్, వ్యవసాయాధికారి నిరంజన్ పాల్గొన్నారు.