ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అధికారం చేతులు మారేందుకు పెద్దగా సమయం పట్టలేదు. 151 సీట్లతో 2019లో వైసీపీ 2024 లో జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతోంది. ఇవాళ అసెంబ్లీలో సాధారణ సభ్యుడుగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఏపీ అసెంబ్లీలో వరసగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా సభ్యులు సాధారణ సభ్యులు ప్రమాణం చేయనున్నారు.