రాష్ట్ర అడ్వకేట్ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏజీగా బాధ్యతలు చేపట్టేందుకు హైకోర్టుకు వచ్చిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సతీసమేతంగా కార్యాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏజీకి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, న్యాయవాదులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.