న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కోటబొమ్మాళి కోర్టు జూనియర్ సివిల్ న్యాయాధికారి డీఎంఆర్ ప్రసన్నలత అన్నారు. గురువారం బోరుభద్రలో ఏపీ హూ మన్ రైట్స్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ చింతాడ చిన్నారావు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వాతావరణం కాలుష్యం జరగకుండా మొక్కలను నాటాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. న్యాయసంఘం ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి బార్ అసోసియే షన్ అధ్యక్షుడు లఖినేని శ్రీనివాసరావు, సర్పంచ్ ప్రతినిధి బుసకల లక్ష్ముమయ్య, తదితరులు పాల్గొన్నారు.