గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. పురందేశ్వరి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సోమూవీర్రాజు హాజరయ్యారు. కూటమి మీద ఉన్న విశ్వాసంతో తమను ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. బటన్ నొక్కి పథకాలు ఇస్తున్న అనే జగన్ అహంకారపూరితానికి ప్రజలు విసుగుచెందారని అన్నారు.