రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్ప డిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ సంద ర్భం గా ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసారు. దీనికోసం ముందుగా ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక 21, 22వ తేదీల్లో జరిగే రెండు రోజుల సమావేశాలను గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిర్వహిస్తారు. శుక్ర, శని వారాల్లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలతోనూ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేత కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. 22న రాష్ట్ర స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత ఆయన బాధ్యత తీరి పోతుంది. ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి గౌరవంగా ఈ అవకాశం దక్కింది. రాజమండ్రి సిటీ నుంచి నాలుగు సార్లు, రాజమండ్రి రూరల్ నుంచి మూడు సార్లు గోరంట్ల శాసనసభ్యుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.ఏ ప్రాధాన్యతా క్రమంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.