ఒంగోలులోని పాత ఎంప్లాయిమెంట్ కార్యాలయం వద్ద ప్రొఫెషనల్ ఎయిర్ అండ్ బ్యూటీ సెలూన్ లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన షాపు నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా బాధితులు వాపోయారు.