రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ,పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అధికారుల్లో కదలిక వచ్చింది. గత పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి ఎంపీ మాగంటి ముర ళీమోహన్ చొరవతో రాజమహేంద్రవరానికి సైన్స్ మ్యూజియం మంజూ రైంది. రూ.16.82 కోట్లు కేటాయించారు. మొదట స్థల సేకరణ జాప్యమైంది. ఆ తరువాత బొమ్మూరులోని మహిళా ప్రాంగణం పక్కన ప్రధాన రహదారిని ఆనుకుని ఐదెకరాల స్థలంలో కేంద్రం, రాష్ట్రం సమాన భాగస్వామ్యంతో దీనిని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎపీ సీవోఎస్‌టీ) ఆధ్వర్యంలో కలకత్తాలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజి యం(ఎన్‌సీఎస్‌ఎం) ఆధ్వర్యంలో ఇది జరిగింది. 2017లో మంజూరు కాగా 2018 ఫిబ్రవరి 18న శంకుస్థాపన చేశారు. 2019 జనవరిలో పనులు ఆరం భమయ్యాయి. బెంగళూరు కంపెనీ పనులు చేసింది. విద్యార్థులకు సైన్స్ పరంగా బాగా ఉపయోగపడే విధంగా విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దారు. భవ నం, పార్కులు తీర్చిదిద్దారు. కానీ సైట్ ఫిల్లింగ్ చేయకుండా రోడ్డుకంటే పల్లం ప్రాంతంలో దీనిని నిర్మించడం విమర్శలకు దారి తీసింది. టీడీపీ హయాంలో మురళీమోహన్ కచ్చితంగా మెరక చేయాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో,అధికారంలోకి వచ్చిన వైసీపీ కనీసం దీనిని పట్టించు కోలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది.నిర్మాణం పూర్తయినా ప్రారంభించ కుండా వదిలేశారు.తిరిగి పవన్ చొరవతో త్వరలోనే ఇది ప్రారంభం కానుంది.