జంఝావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను రెవిన్యూ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కొమరాడ మండలం జంఝావతి నది రైల్వే వంతెన సమీపంలో చైన్ ప్రోక్లైన్ సహాయంతో లారీలో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తహశీల్దార్ రమేష్ తెలిపారు.