పాతపట్నం నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు సిరిపురం తేజస్వరావ్ శుక్రవారం విజయవాడలో పార్టీ అధ్యక్షులు పురందేశ్వరుని కలిసి దుశ్శాలువతో సత్కరించారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిశానని, పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరినట్లు ఆయన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో బిజెపి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని తెలిపారు.