బాపట్ల జిల్లా ఈపూరుపాలెం పంచాయతీలో యువతీ దారుణ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే నరేంద్రవర్మ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి హోంమంత్రి వంగలపూడి అనిత ద్వారా రూ.10 లక్షల సహాయాన్ని అందజేయటం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 48 గంటలలో ఈఘటనకు కారకులైన వారిని పట్టుకునేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు మృత్యువాత పడటం మరో దురదృష్టకర సంఘటన అన్నారు. కుటుంబ సభ్యులకు నరేంద్రవర్మ ప్రగాడ సానుభూతిని తెలిపారు. సముద్రతీరప్రాంతాలలో భద్రత ఏర్పాట్లు చేపట్టటంతోపాటు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.