ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని కర్నూలు ఏఐఎస్ఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సంక్షేమ భవన్ ఎదుట విద్యార్థులతో ఖాళీ పెట్టెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.సోమన్న మాట్లాడుతూ కర్నూలు నగరంలో మూసివేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మ మ్మను కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు.