చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ కోటపల్లి సమీపంలోని నూరురాళ్ల అటవీప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. మూడు రోజలుగా పంచాయతీ పరిధిలో సంచరిస్తూ రాత్రి సమయంలో పంటలను నష్టం చేస్తున్న ఏనుగుల గుంపు అటవీప్రాంతానికి చేరుకుంటున్నాయి. గ్రామానికి చెందిన కొందరు యువకులు శుక్రవారం నూరురాళ్ల అటవీప్రాంతం సరిహద్దుకు వెళ్లగా ఏనుగులను గుర్తించి.. తమ మొబైళ్లతో ఫొటోలు, వీడియోలు తీశారు. 11 ఏనుగులు అడవిలో సంచరిస్తూ కనిపించినట్లు చెప్పారు. తమ అరుపులతో ఏనుగులు అటవీప్రాంతం మధ్యలోకి వెళ్లాయని వారు చెప్పారు.