పాలనలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి తిరిగొస్తూ తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న ప్రజలను ఆయన గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపించి, అక్కడికే కుర్చీలు తెప్పించుకొని బాధితుల సమస్యలు విన్నారు.