మంత్రాలయం ఏపియుడబ్ల్యూజే తాలుకా మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని కోరుతూ మంత్రాలయం మండల విద్యాధికారి మొహినుద్ధీన్ కు వినతిపత్రం అందజేశారు. ఇందులో జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలూకా అధ్యక్షులు జయరాజు, ప్రధాన కార్యదర్శి హుస్సేని, కోశాధికారి సాబువలి, మండల అధ్యక్షులు భీమరాయ, కార్యదర్శి వెంకట్, కోశాధికారి రఫీ తదితరులు పాల్గొన్నారు.