విశాఖపట్నంకు చెందిన ఆల్‌రౌండర్ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డికి జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ టూర్‌లో మంచి ప్రతిభ చూపాలని మాజీ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కెరీర్లో మరింత ఎదగాలంటూ కోరుకుంటున్నానని వైయస్.జగన్ అన్నారు. విశాఖపట్నానికి చెందిన నితీశ్‌కుమార్ రెడ్డి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడి మంచి ప్రతిభ చూపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa