వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులకు సంబంధించి జిల్లా ఎస్‌పీకి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేరిగ మురళీధర్ , వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు కోరారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.., తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశామని కాకాణి తెలిపారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని ఆదాల తెలిపారు.