వైయస్ జగన్ ఆశీస్సులు, తిరుపతి ప్రజల మద్దతుతో రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉంది అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. పులికాటు సరస్సు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తీసుకురావడం నా ప్రాధాన్యత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉన్నా టీడీపీ అడగకపోవడం బాధాకరం. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో గళం విప్పుతా.. ఈ ఐదేళ్లు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం అని అన్నారు.