కర్నూలు మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో జోహరాపురం రోడ్డులో ఓ అపార్టుమెంటులో పని చేస్తున్న కొండల్రావు (40) అనే భవన కార్మికుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన భవన కార్మికుడు కొం డల్రావు స్థానిక జోహరాపురం రోడ్డులో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటులో మేస్త్రీ కింద కూలి పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం లిఫ్టు సాయంతో ఇటుకలను నాలుగో అంతస్థులోకి లాగుతుండగా.. ఒక్కసారిగా జారి కింద పడ్డాడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.