భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైయస్ జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తేనే భయపడనివాడు ఇప్పుడెలా భయపడతాడు? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారన్నారు, ప్రతిరోజూ వైయస్. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తమ అనుకూల మీడియాతో విష ప్రచారాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలనుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫేక్ న్యూస్‌ను సృష్టిస్తున్నారు. చంద్రబాబుకు ఎంతమందితో సెక్యూరిటీ ఇస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. వైయస్ జగన్ గారికి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయనతోపాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేదా? దేవాన్ష్‌కు నలుగురితో సెక్యూరిటీ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదని నాని చెప్పారు. మరి ఇప్పుడు వైయస్ జగన్‌గారి భద్రతపై ఇంత విషప్రచారం ఎందుకు చేస్తున్నారని ఎల్లో మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.