హిందూపురం పట్టణంలోని ఎంజీఎం పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి, మధ్యాహ్న భోజన పథకం ఏడి రామకృష్ణ, సీఎంఓ అబ్దుల్ మాలిక్ లు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొన్ని రికార్డులను పరిశీలన చేశారు. దీంతోపాటు గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి విద్యార్థుల కోసం ఎన్ని బూట్లు వచ్చాయి, అందులో ఎన్ని బూట్లు విద్యార్థులకు అందించారు, మిగిలిన బూట్ల వివరాలపై ఆరా తీశారు.