వలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. వారికి నెలకు రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వలంటీర్లతో కాకుండా, సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది.