ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పని చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో నాశనం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని.. వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు.