వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై కేసును కొట్టేయాలని కోరుతూ ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.