రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ, సచివాలయాలు, వాలంటీర్లు శాఖా మంత్రిగా కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా కొండేపి నియోజకవర్గంలోని అరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేసుకుంటున్నారు.