యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం కందుకూరు పట్టణంలో విద్యార్థులకు మాదక ద్రవ్య రహితపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా వుండాలని, వాటి వలన జీవితాలు అంధకారమవుతాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, వ్యసనాల పట్ల నేటి సమాజం, జరుగుతున్న సంఘటనల గురించి తెలియచేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.