యువత మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని కొండేపి సీఐ పాండురంగారావు బుధవారం సూచించారు. మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయన్నారు.మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారన్నారు. గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు గంజాయికి బానిసలై యువత తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరారు.