ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని రైతుల పొలాల్లోని మట్టి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని స్ధానిక మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ గురువారం తెలిపారు. 2024-25కు సంబంధించి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఉచిత మట్టి పరీక్షలపై గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రైతు మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa