అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సెలవులో ఉన్న అధికారులు కూడా రావాలని కోరారు. పండుగ పూర్తయ్యే వరకూ ఎవరికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. చెరువు వద్ద ఏర్పాట్లు బాగుండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా అందరూ పని చేయాలన్నారు. పోలీసులు ఎక్కువ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కోరారు.