పిడుగుపడి గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా, రేగిడి మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంకిలి గ్రామానికి చెందిన ఇప్పిలి రాంబాబు, ఆయన సోదరుడు వెంకటరమణ గొర్రెలు పెంచుతూ జీవ నం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సంకిలి-దేవుదళ సరిహద్దుపొలాల్లో బుధవారం సా యంత్రం గొర్రెల మందను మేపిస్తున్నారు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చి, భారీశబ్దంతో పిడుగుపడింది. ఈ ప్రమాదంలో గొర్రెలమందకు సమీపంలో వేరేచోట మేస్తున్న నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. ఘటనాస్థలానికి కొద్దిదూరంలో ఉన్న గొర్రిల కాపరి రాంబాబు స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. ఈయ నకు ఎటువంటి ప్రాణహాని లేకపోవటం కుటుంబీకులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ ఘటనలో రూ. 50వేలు విలువచేసే గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. పిడుగుపాటు సమాచారాన్ని వీఆర్వో గోపాల్‌నాయుడు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తెలియజేశారు.