వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు ఆధ్వర్యంలో చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. చల్లా రామచంద్రారెడ్డి వ్యూహం విజయవంతమైంది. మొత్తం 31 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో మరో వారంలోపు మరి కొంత మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేశారు.