నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త అట్ల శ్రీదేవి(55) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రమే్‌షబాబు బుధవారం రాత్రి చెప్పారు. ఈకేసులో ఏవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులైన భార్య, ముగ్గురు కూతుళ్లపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధానంగా హత్య కేసులో పాల్గొన్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భర్త భాస్కరరెడ్డి వైద్యశాలలో కోలుకుంటున్నట్లు సీఐ చెప్పారు. మంగళవారం రాత్రి ఎస్పీ రఘువీర్‌రెడ్డి హత్యా సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.