రైతుబజారులో చౌకధరలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతుబజారును తనిఖీ చేశారు. నోటీసు బోర్డులో నమోదు చేసిన ధరలకు వ్యాపారులు, పొదుపు గ్రూపు మహిళలు, రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారో లేదోనని ఆమె పరిశీలించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యా దులను తప్పకుండా పరిశీలించి వారికి న్యాయం చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ కాటాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ వెంట మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, ఎస్టేట్ అధికారి హరీష్ కుమార్, హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్, సెక్యూరిటీ గార్డులు చిన్నస్వామి, గోపాల్, హనుమంతు పాల్గొన్నారు.